పాకిస్థాన్ ఆధీనంలో100మంది భారత జాలర్లు...
Published on: Mon Mar 27, 2017 10:31AM

పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్దిని చూపించింది. వందమంది భారతీయులను బంధించి తమ పైశాచికాన్ని మరోసారి నిరూపించారు. వివరాల ప్రకారం..గుజరాత్‌లోని కచ్ జిల్లా పరిధిలోగల జకావ్ సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే మత్యకారులను తమ ప్రాంతంలోకి అక్రమంగా వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర తీర ప్రాంత గస్తీ దళం వారిని అదుపులోకి తీసుకుంది. దాదాపు 100మందిని, 18 బోట్లను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. ఈ సందర్బంగా నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్(ఎన్‌ఎఫ్‌ఎఫ్) కార్యదర్శి మనీశ్ లోధారి మాట్లాడుతూ... దాదాపు ‘100మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్టు మాకు సమాచారం ఉందని...వారి నుంచి తప్పించుకున్న కొంతమంది మత్స్యకారులు తమతో చెప్పారని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మరి దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


