ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం

Publish Date:Nov 19, 2012

 

India wins first Test, India wins Ahmedabad Test ,  India beat england, england india

 

అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. 77 పరుగుల టార్గెట్ ను భారత్ ఒక్క వికెట్ నష్టపోయి చేదించింది. వీరేంద్ర స్వెవాగ్ పరుగులు చేసి స్వాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. పుజారా 41 విరాట్ కోహ్లీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.


ఐదు వికెట్ల నష్టానికి 340 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండు 356 పరుగుల వద్ద ఆరో వికెట్ పడిపోయింది. ప్రియర్ 91 పరుగుల  వద్ద అవుటయ్యాడు. కెప్టెన్ అలిస్టిర్ కుక్ కూడా 176 పరుగుల వద్ద అవుటయ్యాడు.  365 పరుగుల వద్ద ఇంగ్లాండు కుక్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు.  రెండో ఇన్నింగ్సులో ఓజా నాలుగు వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు , జహీర్ ఖాన్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.