చివరి వన్డేలో గెలిచిన భారత్, రాణించిన బౌలర్లు

 

 

 

ఢిల్లీ లో జరిగిన మూడో వన్డేలో ఇండియా పాకిస్తాన్ పై 10పరుగులతో విజయం సాధించింది. భారత్ యువ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ 157 పరుగులకె ఆలౌటైంది. ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. షమీ అహ్మద్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మిస్బావుల్ హక్ 39, జంషెడ్ 34 పరుగులు చేశారు. ఉమర్ అక్మల్ 25 పరుగులు, హఫీజ్ 21 పరుగలు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ భారత్‌పై 2-1 స్కోరుతో కైవసం చేసుకుంది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 43.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ ధోనీ 36, రైనా 31, జడేజా 27, యువరాజ్ 23, గంభీర్ 15 పరుగులు చేయగా మిగిలిన వారందరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో అజ్మల్ 5 వికెట్లు పడగొట్టగా, ఇర్ఫాన్ 2, జునైద్, ఉమర్ గుల్, హఫీజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.