ఢిల్లీ టెస్ట్: ఆస్ట్రేలియా 63/1
Publish Date:Mar 22, 2013
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దీగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ పరుగులేమీ చేయకుండా ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. నాలుగు పరుగుల స్కోరు వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ కు గాయకావడంతో ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా వాట్సన్ ను నియమించారు. గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరం కావడంతో భారత్ ఓపెనర్‌గా అజింక్యా రహనేకు చోటు కల్పించింది. ఆస్ట్రేలియా అత్యధిక ఐదు మార్పులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 63/1 తో బ్యాటింగ్ చేస్తోంది. ఎడ్ కోవాన్ 20, హ్యూజ్ 40పరుగులతో క్రీజులో వున్నారు.