TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టివి, సినీ కళాకారుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఎంత దాచారేంటి..?

Published on: Fri Nov 30, 2012 2:38PM

 

 Income Tax Rides on Brahmanandam House, Income Tax Rides on TV anchors, Income Tax Ride Brahmanandam

 

ఆదాయపు పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లో సినీ, టివి ఆర్టిస్టుల ఇళ్ళ ఫై కొరడా జులిపించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అర్థ రాత్రి వరకూ మొత్తం 12 బృందాలు వారి ఇళ్ళ ఫై ఈ దాడులు నిర్వహించాయి. హాస్య నటుడు బ్రహ్మానందం, గాయని సునీత, గీతా మాధురి, టి వి ఆర్టిస్టులు ఓంకార్, ఉదయ భాను, ఝాన్సీ,సుమ ల ఇళ్ళ ఫై ఏక కాలంలో 40 మంది అధికారులు దాడులు నిర్వహించారు.

 


వీరి ఆదాయానికి తగినట్లుగా పన్ను కట్టలేదనే కారణంగా వీరి ఇళ్ళ ఫై దాడులు నిర్వహించినట్లుగా సమాచారం.  ఈ సినీ ప్రముఖుల ఆదాయానికి సంభందించిన వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు అధికారులు సేకరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, శ్రీ నగర కాలనీ, మోతీ నగర్ ప్రాంతాల్లో హైదరాబాద్ ఫిలిం సర్కిల్ కమీషనర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

 


తన ఇంట్లో దాడులు నిర్వహిస్తున్న సమయంలో బ్రహ్మానందం షూటింగ్ లో ఉన్నట్లు తెలిసింది. అలాగే ఝాన్సీ, సుమ లు కూడా వారి ఇళ్లలో దాడులు నిర్వహించే సమయంలో వారి ఇళ్లలో లేరు. ఈ దాడులకు సంభందించిన పూర్తి వివరాలు అందించేందుకు అధికారులు నిరాకరించారు. ఐతే, త్వరలో అన్ని వివరాలు అందిస్తామని మాత్రం వారు ప్రకటించారు.