‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రిలీజ్ డేట్
Published on: Tue Apr 23, 2013 3:27PM
.jpg)
అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రిలీజ్ ఈ నెల 28న హైదరాబాద్ లో జరగనుంది. ఐతే సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘దేశముదురు’ తర్వాత పూరి- బన్నీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. పూరితో దేవి పనిచేయడమిదే తొలిసారి.


