పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్...

 

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాకు ప్రథమ స్థానం దక్కింది. స్పిన్నర్ మాంత్రికుడు అశ్విన్ జడేజా రెండో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ సారథి స్మిత్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌, జాయ్‌ రూట్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ మరో స్థానం దిగజారి ఐదో స్థానానికి పడిపోయాడు. ఆసీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించలేకపోయిన కోహ్లీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.