TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రత్నప్రభ ఫైర్...జగన్ మైండ్ బ్లాంక్

Published on: Sat Nov 16, 2013 9:45AM

 

 

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీనియర్ ఐఏఎస్ అధికారిణి కత్తి రత్నప్రభ నిప్పులు చెరిగారు. సీబీఐ కోర్టు ప్రాంగణంలో తీవ్ర స్వరంతో ఆమె విరుచుకుపడటంతో జగన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల కిందట ఇందుటెక్ జోన్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వస్తున్న జగన్ కు ..అదే కేసులో నిందితురాలిగా ఉన్న రత్నప్రభ ఎదురుపడింది. అంతే.. జగన్‌ను చూడగానే ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు.


"వాట్ మిస్టర్ జగన్..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..? మీరెవరో నాకు తెలియదు.. ఎప్పుడూ చూడనూ లేదు.. మీతో మాట్లాడిందీ లేదు. కానీ మీ వల్ల మేమందరం సమస్యల్లో పడిపోయాం.. ఈ గొడవలతో మాకేమీ సంబంధం లేదు.. మేం రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం.మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆదేశాలిస్తే.. వాటిని మేం పాటించాం. అయినా మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమందరం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా మేమెందుకు తిరగాలి. ఇంతకాలం నిజాయతీగా బతికి ఇప్పుడు మీ వల్ల మేమంతా అభాసుపాలయ్యాం.. '' అంటూ జగన్‌పై రత్నప్రభ నిప్పులు చెరిగారు.



వాస్తవానికి రత్నప్రభ గురించి జగన్‌కు కూడా పెద్దగా తెలియదు. విచారణకు హాజరై తిరిగి వస్తున్నప్పుడు ఎదురుపడి దుమ్ము దులిపేయడంతో ఆయన కాసేపు నిశ్చేష్టుడయ్యాడు.