హైదరాబాద్ యూటీగా ఒప్పుకోం

 

hyderabad union territory, Hyderabad to be Union Territory?

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ను కేంద్ర పాలితప్రాంతంగా చేస్తామంటే ఒప్పుకోమని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్, టీర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావులు వేర్వేరుగా స్పందించారు. ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలనే రాష్ట్రాలుగా మారుస్తుంటే ఇప్పుడు యూటీ వాదన ఏంటి..దానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అని దానం నాగేందర్ తేల్చిచెప్పారు. జాతీయ ఛానళ్లలో వచ్చిన యూటీ వార్తలు ఊహాగానాలని, హైదరాబాద్ ప్రజాప్రతినిధులం అంతా అంటోని కమిటీని కలుస్తామని ఆయన తెలిపారు.

 


హైదరాబాద్ యూటీ అంటే తాట తీస్తామని, అలాంటి ఆలోచన ఏది ఉన్నా వెనక్కి తీసుకోవాలని, తమకు దక్కనిది ఇంకొకరికి దక్కకూడదన్న ఆలోచన సీమాంధ్ర నేతలు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాన ప్రజల రక్తమాంసాలతో నిర్మితమయిన నగరం అని దానిని యూటీ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ లో సమైక్య సభ పెడతామంటున్న ఏపీఎన్జీఓ నేతలు చిత్తూరులోనో, విశాఖలోనో, విజయవాడలోనో సభ పెట్టుకోవాలని, హైదరాబాద్ వచ్చి సభ పెడతామంటే కళ్లప్పగించి చూస్తూ ఉండమని అన్నారు. పుండు మీద కారం చల్లే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.