హృతిక్ రోషన్‌కు బ్రెయిన్ సర్జరీ
Published on: Mon Jul 8, 2013 10:46AM

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హృతిక్‌కు ఆపరేషన్ చేసినట్టు డాక్టర్లు వెల్లడించారు. గతంలో ఓ షూటింగ్‌లో భాగంగా సీన్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ హృతిక్ రోషన్ తలకు గాయమైంది. దీంతో ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సిందిగా గతంలో వైద్యులు సూచించారు. హృతిక్‌కు చేసిన ఆపరేషన్ చాలా చిన్నదని, భయపడాల్సిన అవసరంలేదని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మీడియాకు వెల్లడించారు.


