TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లి కోసం అంకిత పూజలు

Published on: Thu Mar 20, 2014 10:33AM

 

 

 

‘ఐ లవ్ యూ రస్నా’ అంటూ అందరినీ అలరించి...అనంతరం నటిగా మారిన అంకిత ప్రస్తుతం పెళ్లి కోసం పూజలు చేస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యలుతో కలిసి శ్రీకాళహస్తిశ్వరాలయంలో ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకుంది. ఈ సందర్భంగా వేదపండితులు అంకితతో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామివారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

 

స్వామివారి దర్శనం అనంతరం అంకిత విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు  తెలిపింది. తాను అమెరికాలో చదువుకుంటున్నానని ప్రస్తుతం  పెళ్లి చేసుకునే పనిలో ఉన్నానని... ఆ తర్వాత సినిమాలు చేయాలా వద్దా...? అనేది చెబుతానని అంటోంది. టాలీవుడ్ లో పెద్దగా ఆదరణ లేకపోవడంతో తమిళనాడుకు వెళ్లి, అక్కడ కూడా అవకాశాలు లేక అమెరికాలో స్టేజి షోలు చేసిన అంకిత, ఇప్పుడు పెళ్లిపనిలో పడిందన్న మాట.