TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

Published on: Mon Jun 23, 2025 5:01PM

 

తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. 

ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గత కొద్దిరోజుల నుంచి వాతావరణం చల్ల బడింది. కొంత సేపు ఎండలు పెట్టినా.. మిగితా సమయం మబ్బులు కమ్ముకుంటున్నాయి.  పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పింది.