TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'చైతన్యరథం'పైనే హరికృష్ణ అంతిమయాత్ర

Published on: Wed Aug 29, 2018 6:02PM

నందమూరి హరికృష్ణ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చే పదం చైతన్యరథం.. చైతన్యరథానికి హరికృష్ణకి విడదీయరాని అనుబంధం ఉంది.. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు.. ఆ చైతన్యరథం పైన ఏపీ అంతా తిరిగారు.. అయితే ఆ చైతన్యరథానికి డ్రైవర్ ఎవరో కాదు హరికృష్ణ.. తండ్రి కోసం డ్రైవర్ గా మారారు.. తన తండ్రి రాజకీయ జీవితానికి అండగా నిలబడ్డారు.. అందుకే ఎన్టీఆర్ ప్రస్థానం గురించి ఎవరు మాట్లాడినా హరికృష్ణ ప్రస్తావన కచ్చితంగా రావాల్సిందే.

 

 

తండ్రి చైతన్యరథానికి డ్రైవర్ గా పనిచేసిన హరికృష్ణ, చివరికి తానే కారు డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురై చనిపోయారు.. దీంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.. హరికృష్ణ అంత్యక్రియలు రేపు సాయంత్రం జరగనున్నాయి.. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. సాయంత్రం 4 గంటలకు నివాసం నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.. అయితే హరికృష్ణ అంతిమయాత్ర చైతన్యరథంపై నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఆయన అంతిమయాత్ర చైతన్యరథంపై జరుగనుందని సమాచారం.