సైకో సాంబ వెతుకులటాకు బ్రేక్
Published on: Sun Jul 15, 2012 1:28PM
కొండపల్లి అడవిలో తప్పించుకున్న రాచకుంట సాంబశివరావు అలియాస్ సాంబ (32) కోసం పోలీసు బలగాలు మూడు రోజులుగా కొనసాగిస్తున్న కూంబింగ్ కు బ్రేక్ పడింది. కొండపల్లి అడవిలో వర్షం పడుతుండడంతో గాలింపు చర్యలకు ఆటకం కలిగింది. మరోవైపు కొండపల్లి అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సాంబశివరావు ఆచూకీ కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు.


