పాఠశాలలోని టాయిలెట్ల శుభ్రత విద్యార్ధులదే
Published on: Thu Aug 2, 2012 10:12AM
విద్యార్దులు ఎవరి టాయిలెట్లను వారే గ్రూపులుగా ఏర్పడి శుభ్రపరచుకోవాలని, ప్రాధమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనాఖన్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా విద్య, యూనిఫాం, పుస్తకాలు, స్కాలర్‌షిప్ వంటివి ఇస్తుంటే విద్యార్దులు వారి పని వారు చేసుకుంటే తప్పేమిటని అడిగారు. 400 మంది విద్యార్దులు ఉపయోగించే టాయిలెట్లను ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయలకు శుభ్రపరచడానికి ఎవరూ రావడంలేదని ఆమె తెలిపారు.
హైదరాబాద్‌లోని జూబ్లీ హాల్‌లో యునిసెఫ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల విద్యార్ధుల సదస్సులో చందనాఖన్ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. తమిళనాడు, కర్ణాటకలో ఇప్పటికే ఈ విదానం అమలులో ఉందని ఆమె గుర్తు చేశారు. దీనిద్వారా చిన్నతనం నుండే డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుస్తుందని ఆమె తెలిపారు.పాఠశాలలో ఎస్టీ ఎస్సీ విద్యార్ధులతోనే కాకుండా అందరూ కలసి శుభ్రం చేసుకోవాలని చెప్పారు.


