గోవాలో అసెంబ్లీ.. నేడే బలపరీక్ష..
Published on: Thu Mar 16, 2017 11:08AM

గోవాలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశించిన ప్రకారం ఈరోజు గోవా శాసనసభలో బలపరీక్ష జరుగనుంది. మనోహర్‌పారికర్ ప్రభుత్వం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోనుంది.
కాగా గోవా ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమవ్వడంతో బీజేపీ రాత్రికి రాత్రే మంతనాలు జరిపి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. కాంగ్రెస్ పై మండిపడి....రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బలనిరూపణకు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే ఈరోజు గోవా శాసనసభలో బలపరీక్ష జరుగనుంది. మరి ఎవరి బలమెంతో తెలుసుకోవాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.


