గ్రేటర్ ఎన్నికలు.. నేతలపై కేసులు..
Published on: Thu Feb 4, 2016 12:20PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు.. మజ్లిస్ కు మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసులు నమోదు చేయగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చాంద్రాయణగుట్ట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.


