గంగా నదికి మనిషి హోదా..
Published on: Tue Mar 21, 2017 12:32PM

పవిత్ర నది గంగా నదికి ఓ అరుదైన గుర్తింపు లభించింది. ఓ మనిషి హోదా లభించనుంది. గంగానదిపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గంగా తీరంలో అక్రమంగా సాగుతున్న మైనింగ్‌ను అరికట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీనిపై విచారించిన కోర్టు.. భారత నాగరికత గంగతోనే మొదలైందని, దేశంలో తొలి జీవించి ఉన్న ప్రాణి గంగేనని చెప్పింది. అంతేకాదు.. గంగతోపాటు దాని ఉపనది యమునకు కూడా ఈ హోదా లభించింది. ఈ హోదా వల్ల నమామి గంగా పేరుతో జరుగుతున్న గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యత దక్కనుంది. దీంతో ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నమామి గంగా పేరుతో నదిని శుభ్రం చేసే పని మొదలుపెట్టింది. ఈ నదుల బాగోగులను చూసుకోవడానికి ముగ్గురిని ప్రత్యేకంగా నియమించింది కోర్టు. నమామి గంగా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ, అడ్వొకేట్ జనరల్‌లకు ఆ బాధ్యతలను అప్పగించింది. గంగతోపాటు దాని ఉపనదుల పరిరక్షణ బాధ్యతలను వీళ్లు చూసుకోవాల్సి ఉంటుంది.


