పవన్ గబ్బర్ సింగ్ సినిమా టాక్
Published on: Fri May 11, 2012 4:21PM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఈ రోజు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది అవుట్ అండ్ అవుట్ పవన్ చిత్రం. పవన్ అవుట్ స్టాండిగ్ గా తన పాత్రలో జీవించాడు. కామెడీ,పంచ్ డైలాగులు,తనదైన శైలిలో స్టెప్స్ వేసి అలరిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ లో అయితే విశ్వరూపం చూపించాడని చెప్తున్నారు. శృతిహాసన్ ..అమాయికమైన పల్లెటూరు అమ్మాయి గా ఉన్నవి కొద్ది సీన్స్ అయినా అదరకొట్టింది. కానిస్టేబులు సాంబగా అలీ,పవన్ మధ్య సీన్స్ నవ్విస్తే,బ్రహ్మానందం రికవరి రంజిత్ కుమార్ గా కెవ్వు కేక అనిపిస్తాడు. సుహాసిని,నాగినీడు తమ పాత్రలకు న్యాయం చేసారు. సిద్దప్ప నాయుడుగా అభిమన్యు సింగ్..పవన్ కి కరెక్టు స్క్రీన్ విలన్ గా కనిపించి నడిపిస్తాడు. ఇలా పూర్తిగా పవన్ బ్రాండ్ తో వచ్చిన, పవన్ అబిమానలుకు మాత్రం కెవ్వు కేక అనిపిస్తుంది.


