సోనియా ఓటు వేయకుండానే ఆహర భద్రత బిల్లు

 

సోనియా మానస పుత్రికగా, యుపిఏ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎలాగైన ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్‌ చేయించాలనుకున్న కాంగ్రెస్‌ తన పంతం నెగ్గించుకుంది.

సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం వాడివేడిగా చర్చ జరిగింది అయితే 15వ లొక్‌సభలో తొలిసారి ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించారు.

అయితే సమావేశం జరుగుతున్న సమయంలోని సోనియా అస్వస్థతకు గురికావటంతో ఆమె ఓటింగ్‌లో పాల్గొన కుండానే వెళ్లిపోయారు. సోనియాతో పాటు రాహుల్‌ కూడా వెళ్లిపోయారు. బిల్లు లక్ష్యాలను సభకు వివరించిన ఆహార మంత్రి కెవి థామస్‌ బిల్లును ప్రవేశ పెట్టారు.ఆహార భద్రత బిల్లు అమలులోకి వచ్చినప్పటికీ.. రాష్ట్రాలకు ఆహార ధాన్యాల సరఫరాను తగ్గించబోమని స్పష్టంచేశారు.