TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం.!

Published on: Wed Jul 15, 2026 8:29AM

హైదరాబాద్  శివార్లలోని మీర్‌పేట లో బుధవారం (జులై 15) ఉదయం  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే.. నందనవనం మెట్రో బార్ సమీపంలోని ఒ  ప్లాస్టిక్  గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఆ మంటలు వేగంగా వ్యాపించి  చూస్తుండగానే ప్లాస్టిక్ మొత్తం కాలి బూడిదైంది. నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో  ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.   గోడౌన్‌ తోపాటు పక్కనే ఉన్న మరో  గోడౌన్, సమీపంలోని నివాస భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి.  సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక  సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశారు.

మీర్‌పేట పోలీసులు  ప్రమాద స్థలంలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకుంటూ, సహాయక చర్యలు  పర్యవేక్షించారు.ఈ   ప్రమాదంలో గో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.  ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యాూట్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  

 Fire Accident in Meerpet, Plastic Godown Burnt, Hyderabad Warehouse Fire, Rangareddy District News, Fire Safety Investigation, Nandanavanam Metro Bar Fire