ఎంపిల డుమ్మా : చర్యలు తీవ్రంగా ఉంటాయంటున్న బాబు

 

 

 

 

 

 

 

ఎఫ్ డి ఐ లఫై పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ కు దూరంగా ఉన్న ముగ్గురు తెలుగు దేశం సభ్యుల వివరణ సరిగా లేకపోతె వారి ఫై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ప్రకటించారు.

 

‘ప్రజా సమస్య కోసం నేను సుదీర్ఘ పాద యాత్ర చేస్తున్న సమయంలో జరిగిన ఈ చర్య నన్ను తీవ్రంగా కలిచివేసింది. అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని దేవేంద్ర గౌడ్ ముందుగానే నాకు తెలియచేసారు. సుజన, సుధా రాణిలు నాకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. వారిది ద్రోహమని తేలితే వారిఫై చర్యలు తీవ్రంగా ఉంటాయి. అదే సమయంలో పొరపాటు అని తేలితే, తీవ్రమైన చర్యలు తీసుకోవడం సరికాదు’, అని బాబు అన్నారు.

 

జైల్లో ఉంది కూడా రాష్త్రపతి ఎన్నికల్లో ప్రణబ్ కు ఓటు వేసిన వారు, రాష్ట్రాన్ని దోచుకొన్న వారు మమ్మల్ని విమర్శించే పరిస్తితి వచ్చారని బాబు అన్నారు. ఒక ఎంపి నో, ఒక ఎం ఎల్ ఏ నో పోయినా పరవాలేదని, విలువలతో కూడిన రాజకీయాలతో కూడిన రాజకీయాలు ముఖ్యమని బాబు వ్యాఖ్యానించారు.

 

ఈ ఎం పి లఫై తీవ్ర చర్యలు ఉంటాయనే విధంగా బాబు వ్యాఖ్యలున్నాయి. అయితే, వారిఫై తీవ్ర చర్యలు నిజంగా ఉంటాయా అని పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అంశం ఫై ఇతర పార్టీ నాయకుల కన్నా తెలుగు దేశం నాయకులే ఎక్కువ రాద్ధాంతం చేశారు. ఈ పరిస్తుతుల్లో ఈ విషయాన్ని మరింతగా సాగదీయడం వల్ల ఎంతకాదనుకున్న పార్టీకి నష్టమే కాబట్టి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.