TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటికో రైతు రుణ మాఫీ: చంద్రబాబు హామీ

Published on: Thu Jul 17, 2014 12:01AM

 

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు తీసుకున్న రుణాల్లో ఇంటికో రుణం చొప్పున మాఫీ చేస్తామని ముఖ్యమంత్రిచంద్రబాబు ప్రకటించారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోటలో జరిగిన రైతు సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రైతు రైతుల రుణమాఫీకి తాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నానని, తప్పకుండా ఇంటికో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపైఆర్బీఐ గవర్నరుతో చర్చించానని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పదేళ్లుగా రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు తాను రైతుల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.