విద్యుత్త్ ఉద్యోగుల సమ్మె విరమణ

 

 electricity employees call off strike, Seemandhra electricity employees,Talks between AP government

 

 

సమైఖ్యాంధ్ర కోసం విద్యుత్త్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె ముఖ్య మంత్రి చర్చల తరువాత ఈరోజు వాయిదా పడింది. వీరి సమ్మె కారణంగా సీమాంధ్ర లోని ప్రజలు గత కొద్ది రోజులగా ఇబ్బంది పడుతూ నరకాన్ని చవిచుశారు. తుఫాన్ కారణం గా సీమంధ్ర లో మరియు రాష్ట్ర వ్యాప్తం గా పలు ప్రాంతాలలో తలేత్తనున్న పరిస్థితుల దృష్ట్యా తాత్కాలికంగా సమ్మె విరమించు కుంటున్నట్లు విద్యుత్త్ ఉద్యోగ జె.ఎ.సి అద్యక్షుడు సాయిబాబు తెలియ జేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళితే మళ్ళి సమ్మె చేస్తామని వారు తెలియచేస్తున్నారు. ఇప్పటినుండి విద్యుత్త్ ఉద్యోగులు విధులకు హాజరైన కూడా వి.టి.పి.యెస్ లో మరమ్మత్తులు చేపట్టిన కూడా కోస్తాంధ్ర లో ని పలు ప్రాంతాలకు విద్యుత్త్ సరఫరా పూర్తి స్థాయి లో కావటానికి 48గంటల సమయం పడుతుందని అధికారులు చెపుతున్నారు.