TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీలేరులో రెండు నాటు పడవలు బోల్తా.. 8 మంది గల్లంతు 

Published on: Tue May 25, 2021 9:36AM

విశాఖపట్నం జిల్లా ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు పడవలు నీట మునిగాయి. ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఒక చిన్నారి తదేహం లభ్యమైంది.  మరో ముగ్గురు ప్రయాణికులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు పడవల్లో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ కూలి పనులకు వెళ్ళి లాక్‌డౌన్ వల్ల తిరిగి స్వగ్రామలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన కూలీలది గుంటవాడ, కెందుగుడా గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మల్కాన్ గిరి జిల్లా కెందుగుడ వద్ద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.