మా దేశంపై కూడా నిషేదం విధించండి...

posted on: Jan 30, 2017 11:40AM

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 7 ముస్లిం దేశాలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ పై కూడా ఆంక్షలు విధించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ పై నిషేదం విధిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రికెటర్‌, పాకిస్థాన్‌ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అమెరికాకు రాకుండా  పాకిస్థానీయులపై కూడా ట్రంప్‌ నిషేధం విధిస్తారని ఆశిస్తున్నానని, దీనివల్ల పాకిస్థానీలు తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 'చాలామంది పాకిస్థానీలు కూడా అమెరికా వీసా ఆంక్షలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోందిని.. పాకిస్థానీలకు వీసాలు ఇవ్వొద్దని ట్రంప్‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను... ఇది మాకు మేలు చేస్తుంది. మేం మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాం' అని ఆయన అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...