TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిఎంకె పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు

Published on: Sat Jan 25, 2014 10:35AM

 

 

 

డిఎంకె పార్టీలో కుటుంబ, పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి. కరుణానిధి ఏకంగా తన తనయుడినే పార్టీ పదవుల నుండి బహిష్కరించడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పార్టీపై మండిపడ్డారు. తన తండ్రిని కొ౦త మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం లెదని..కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో బహిష్కరించారని అన్నారు.


డిఎంకె పార్టీ విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అళగిరి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విమర్శలు చేసినందుకు అళగిరిని కరుణ తీవ్రంగా మందలించారు. డిఎంకెలో కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.