విభజనపై సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారు: దిగ్విజయ్

 Digvijaya Singh, seemandhra congress, congress leaders, telangana state, Samaikyandhra agitation

 

 

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అందరినీ కాంగ్రెస్ అధిష్టానం విభజన విషయంలో ప్రశ్నించిందని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతా హామీ ఇచ్చారని దిగ్విజయ్ వెల్లడించారు. వారు ఒప్పుకున్న తరవాతనే విభజన నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తరువాత వారు మాట మార్చడం సరికాదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలకు ఇబ్బందులు ఉన్న మాటను ఎవరూ కాదనడం లేదని, వారు తమ ప్రాంతానికి మంచి ప్యాకేజీలు, సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, ప్రతిపాదనలు మంత్రుల బృందానికి ఇవ్వాలని సూచించారు. ఎవరూ రాజీనామాల గురించి తొందరపడొద్దని సూచించారు.

 

పైలాన్ తుఫానును అడ్డుకోలేక పోయాం. కానీ తెలంగాణ అనే విభజన తుఫానును ఖచ్చితంగా అడ్డుకుంటాం. దీనికి ప్రజల సహకారం కావాలి’ అని తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు.