శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Wed Oct 2, 2024 9:31AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (అక్టోబర్ 2) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (అక్టోబర్ 1) శ్రీవారిని మొత్తం 69 వేల 300 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 884 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.


