డెంగీ రోగులపై ప్రై వేటు
Published on: Mon Oct 8, 2012 2:37PM
రాష్ట్రంలోని ప్రయివేటు ఆసుపత్రులు జలగలను కూడా తలదన్నే యత్నం చేస్తున్నాయి. జ్వరం వస్తే చాలు డెంగీ పరీక్షంటూ డబ్బులు గుంజుతున్నారు. అది వైద్యాధికారులకు తెలిసినా రాష్ట్రం అంతటా డేంగీ జ్వరాలపై అవగాహన పెంచే ప్రయత్నమే చేయటం లేదు. జ్వరం వచ్చిన రెండు మూడు రోజులకే రోగులు చనిపోవడంతో పరీక్షలకోసం రోగులు ప్రయివేటు ఆసుపత్రులకు పరుగెడుతున్నారు. ఇదే అవకాశంగా ల్యాబ్ టెక్నీషియన్లు డబ్బులు గుంజుతున్నారు. దీనిలో మరో విశేషం ఏమంటే ర్యాపిడ్ టెస్టు జరిపిస్తున్నారు. దీనిలో చాలా మందికి డెంగీ లేకపోయినప్పటికీ అది పాజిటివ్ గానే చూపుతుంది కచ్చితమైన నిర్ధారణకు రావాలంటే ఎలీషాకిట్ ద్వారా మరో సారి పరీక్షించవలసి ఉంది అయితే దాని వరకు వెళ్లకుండానే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలని చెప్పి మంరింత దోచుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.


