బస్సులో గ్యాంగ్ రేప్..దుస్తులు విప్పేసి తోసేసిన కిరాతకులు
Published on: Mon Dec 17, 2012 12:28PM
.jpg)
దేశ రాజధాని లో మహిళలకు భద్రత లేదని వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా, గత అర్ధ రాత్రి నగరం నది బొడ్డున ఓ మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురి అయింది.
దక్షిణ ఢిల్లీ లోని వసంత విహార్ లో గత రాత్రి ఓ మెడికల్ స్టూడెంట్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. ఆ బస్సులో ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఓ మూల కూర్చో బెట్టి, ఆమె ఫై కొంతమంది ఆకతాయిలు రేప్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ బస్సులోనుంది తోసివేశారు. సఫ్తార్ జంగ్ ఆసుపత్రిలో వీరిద్దరికీ ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. వీరిలో ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఢిల్లీ నగరంలో మహిళలకు ఎంత మాత్రం భద్రత లేదని ఇటీవల జరిగిన అనేక సర్వేలు వెల్లడిస్తున్నా పోలీసులు తీసుకొంటున్న చర్యలు మాత్రం నామ మాత్రం గానే ఉంటున్నాయి.


