దావూద్ కు గుండెపోటు.. ఏ విషయం చెప్పలేం..
Published on: Sat Apr 29, 2017 10:17AM
.jpg)
ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కుడివైపు శరీరానికి పక్షవాతం సోకి పాకిస్థాన్ లోని కరాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని...ఈ నేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని రిపోర్టులు వచ్చినట్టు సమాచారం. దీంతో తాజాగా పక్షవాతం, ఆపై గుండెపోటుతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, వెంటనే కోలుకునే అవకాశాలు లేవని, తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, 24 గంటలు గడిస్తేగాని ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేసినట్టు సమాచారం.


