విశ్వాసాన్ని కోల్పోయాం – దానం నాగేందర్!
Published on: Sat Feb 6, 2016 11:01AM
.jpg)
కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బడుగుబలహీన వర్గ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే, గ్రేటర్ ఎన్నికలలో పరాజయానికి కారణమన్నారు దానం నాగేందర్. ఎన్నికలు జరుగుతున్నప్పుడే తనకి రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయే తెలిసిపోయిందనీ… ఓటరు నాడిని తాను అప్పుడే గ్రహించాననీ నేడు జరిగిన ప్రెస్‌మీట్లో చెప్పుకొచ్చారు దానం. అందుకే ఎన్నికల తరువాత తన అభ్యర్థులందరినీ ఓటమికి సిద్ధంగా ఉండమంటూ ఓదార్చానన్నారు. అధికార పార్టీనే మేయర్ పీఠం మీద ఉంటే తమకు లాభం చేకూరుతుందని ఓటర్లు భావించారనీ…. అందుకే తెలివిగా ఇంత భారీ మెజారటీని కట్టబెట్టారనీ వాపోయారు. అయితే ప్రజలకి వాగ్దానం చేసినట్లుగా తెరాస తన హామీలు అన్నింటినీ నిలబెట్టుకోవాలనీ, లేనిపక్షంలో తాము వారిని నిలదీస్తామని హెచ్చరించారు. గ్రూపు తగాదాల వల్ల కూడా తమ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు దానం. ఈ ఎన్నికలలో పరాజయానికి వ్యక్తిగత బాధ్యతను వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజినామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.


