ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి డి. శ్రీనివాస్‌ రాజీనామా..


తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధలు ఖరారైన సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్లిన డీఎస్ కు, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి డి. శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించారు.