కోస్తాంధ్రలో 'హెలెన్' బీభత్సం

 

 

 

 

'హెలెన్' తుఫాన్ దెబ్బకు పచ్చని కోనసీమ మరోసారి కకావికలమైంది! వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలరాలాయి! మిగిలిన చెట్లు తుఫానుకు ఎదురు నిలిచినా.. వాటిపై ఒక్క కాయ కూడా లేదు. కోనసీమ కొబ్బరి రైతు మరో పదేళ్లదాకా కోలుకోలేని రీతిలో తుఫాను దెబ్బతీసింది. లక్షల హెక్టార్లలో పంటలు మునిగాయి.

 

అరటి, చెరకు, తమలపాకు, పసుపు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుత్తు వ్యవస్థ చిన్నాభిన్నమైంది! వేల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి! వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది! ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1055 విద్యుత్తు స్తంభాలు కుప్పకూలాయి. 88 కిలోమీటర్ల విద్యుత్తు లైన్లు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సహా తీర ప్రాంత మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23 సబ్ స్టేషన్ల పరిధిలోని వంద గ్రామాల్లో అంధకారం నెలకొంది. 800కుపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. కోనసీమ సహా వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.



తుఫాను బీభత్సానికి కోస్తా జిల్లాల్లో 13 మంది మరణించారు. వీరిలో చెట్లు మీద పడి ఐదుగురు, విద్యుత్తు స్తంభాలు కూలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

 

video coutesy:tv9