సామజిక వర్గానికో రాజకీయ పార్టీ
Published on: Sat Apr 14, 2012 3:09PM
రాష్ట్రంలో సామజిక వర్గాలా ఆదారంగా భవిష్యత్తులో మరిన్ని రాజకీయపార్టీలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న ఎం.ఐ.ఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు క్రమంగా సామజికవర్గాల పార్టీలుగా మారుతుండగా తాజాగా ఎస్సీలను సంబంధించి ప్రత్యేకించి మాదిగ సామజిక వర్గానికి ప్రత్యేకపార్టీలుగా ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ ప్రధానంగా బిసి ఓటర్ల ఆదారంగా అధికారంలోకి వచ్చినప్పటికీ వాస్తవంలో ఆ పార్టీ కమ్మ సామాజికవర్గ పార్టిగా పేరు పొందింది. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి ఎస్సీ, ఎస్టిలా నామం జపం చేయడం మినహా తమను ఎ మాత్రం పట్టించుకోవడంలేదనే తీవ్ర నిరుత్సాహంతో బిసిలున్న స్థితిలో తెలుగుదేసంపర్తి ఓటు చేశారు. దాంతో రాష్ట్ర జనాబాలో మూడు శాతం కూడా లేని కమ్మ సామజిక వర్గం అధికారంలోకి వచ్చింది. 1953నుంచి 1983వరకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చే వరుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడమే కాకుండా అధికారం చేలించడంలో రెడ్డి సామజికవర్గానిదే పై చేయి ఉంది. కాంగ్రెస్ పార్టిలో ఎస్సీ వర్గానికి చెడిన వారినే ఓటు బంకగా పరిగాని౦చేవారు. కాపు వర్గం కాంగ్రెస్ పార్టికి సన్నిహితంగా ఉన్నపటికీ అధికారం, పదువులు వచ్చే సరికి కాపులను ద్వితియస్తానంలోనే ఉంచేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం సంభవించిన పరిణమల వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడింది. ఎ పార్టీ పూర్తిగా రెడ్డి సామజిక వర్గానికి చ్చేడిన పార్టీ గా పేరు తెచ్చుకోటుంది. దినిద్వారా కాంగ్రెస్ కాపు సామజికవర్గా పార్టీగా తెచ్చుకునే అవకాశంతో పాటు కాపు సామజిక వర్గానికి చెందిన చిరంజీవి, బొత్స, డిఎస్ వంటి వారికీ ప్రాదాన్యత ఇవ్వడమే అందుకు నిదర్శనం. కమ్మ సామాజిక వర్గా పార్టీగా బావిస్తున్న తెలుగుదేశంలో బిసిలకు తగిన ప్రాదాన్యత లబించకపోతే దేవేంద్రగౌడ్, తలసానీ శ్రీనివాస్ యాదవ్, యనమల రామకృష్ణుడు, ఆర్ కృష్ణయ్య వంటి బీసిలా నేతల ఆధ్వర్యంలో ప్రతెక్యంగాబిసిల పార్టీ ఏర్పడిన ఆశ్చర్యం లేదు.


