పాతబస్తీ అల్లర్లులో ముగ్గురికి కత్తిపోట్లు
Published on: Mon Apr 9, 2012 10:25AM
పాతబస్తీ అల్లర్లు 2012: ఆదివారం పాతబస్తీ అల్లరి మూకలు శాంతి భద్రతల్ని కొల్లగోట్టాయి. పరస్పర దాడులు కారణంగా ముగ్గురికి కత్తిపోట్లు, ఆరుగురికి గాయాలయ్యాయి. ఆల్లర్లులు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు బారీగా అధనపు బలగాలను మొహరించారు, అయినా దాడులు ఆగకపోవడంతో మాదన్నపేట, సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిదిలో కర్ఫ్యూ ప్రకటించారు.
ఈ అల్లర్లలో సుమారు 12 అర్ట్టిసి బస్సులు ద్వంసమయ్యాయి. సైదాబాద్ రోడ్లపై రాళ్ళతో దాడులు చేయటంతో పాటు ద్విచక్ర వాహానాలు ఆపి ధ్వంసం చేశారు. బస్సులో ప్రయాణించే వారిని కూడా దింపి గాయపరిచారు. గాయపడిన వారిలో ఆదాయపన్ను శాఖ అదికారి కూడా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితుల్ని హోంమంత్రి పరామర్శించారు.


