యూపీ సీఎం ఎఫెక్ట్... 50 జంటలు అరెస్ట్..
Published on: Tue Mar 21, 2017 11:31AM

యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ అలా బాధ్యతలు చేపట్టారో లేదో.. అప్పుడే తన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించే పనిలో పడినట్టు తెలుస్తోంది. సీఎంగా ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాజారియా ప్రాంతంలో విస్తృతంగా సోదాలు జరిపి.. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు హోటళ్లపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు 50 జంటలను పట్టుకున్నారు. ఆ రెండు హోటళ్లను పోలీసులు మూసివేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తవాలీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హోటళ్లలో ఈ జంటలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల కారణంగానే వారిని అరెస్టు చేశామని.. వారి తల్లిదండ్రులను పిలిపించి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇటువంటి కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆ రెండు హోటళ్లను పోలీసులు మూసివేశారు.


