కిరణ్ తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు

 

 

 

శాసనమండలిలలో తెలంగాణ బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం ఉదయం ప్రసంగించారు. విభజన అంశం సున్నితమైనదని, ఇలాంటి అంశాలపై జాగ్రత్తగా మాట్లాడితే ఎవరికీ ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విభజన సమయంలో చర్చ ఎలా జరిగిందో అందరూ అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే మరోసారి బీఏసీ సమావేశం పెడదామని సీఎం కిరణ్ తెలిపారు. అయితే సీఎం ప్రసంగంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా అందరికీ అర్థమయ్యేందుకే అన్ని చెబుతున్నామని సీఎం కిరణ్ వివరణ ఇచ్చారు.

 

మరోవైపు ముఖ్యమంత్రి తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు నటిస్తే అప్పులోడు వెళ్లిపోయినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ అన్నారు. కిరణ్ చర్చపై మాట్లాడినా సీమాంధ్ర సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. నొప్పి వస్తే కాళ్లు చేతులు కొట్టుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్తేనే తగ్గుతుందని, అలాగే మీ సమస్యలు తీరాలంటే చర్చ జరగాలన్నారు.