చెన్నై అపోలో వద్ద ఉద్రిక్తత.. పేషెంట్లను వేరే ఆస్పత్రికి తరలింపు


చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో అమ్మ ఆరోగ్యం గురించి కీలక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులు సంగతైతే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివస్తున్నారు. అమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది అని చెప్పడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ముందే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ముందుగానే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. అపోలో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున భద్రత కట్టుదిట్టం చేసింది. అంతేకాదు దాదాపు తమిళనాడుకు 500 కిలో మీటర్ల దూరం నుండే అభిమానులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక అమ్మ ఆరోగ్యం నేపథ్యంలో ఐటీ కంపెనీలకు మధ్యహ్నం నుండే సెలవులు ప్రకటించేశారు. ఇక దుకాణాలు.. పాఠశాలలు.. ప్రయాణాలు, బస్సు సర్వీసులు ఈరోజు ఉదయం నుండే రద్దయ్యాయి. చెన్నై మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

 

పేషెంట్లను వేరే ఆస్పత్రికి తరలింపు..

 

మరోవైపు అపోలో ఆస్పత్రిలో ఉన్న ఇతర పేషెంట్లను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దాదాపు నలభై అంబులెన్స్ లలో పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు.