TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భూమా చివరి కోరిక అదే...

Published on: Tue Mar 14, 2017 11:17AM


ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన భూమా నాగిరెడ్డి మరణం తరువాత, ఆ కుటుంబానికి తాను పెద్ద దిక్కుగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం అనునిత్యమూ తపించేవారని....నంద్యాలలో పేదలందరికీ ఇళ్లు కట్టించాలని తనను కోరారని గుర్తు చేసుకున్నారు. అదే ఆయన చివరి కోరిక అవుతుందని తాను ఎంతమాత్రమూ అనుకోలేదని.. నంద్యాల పేదలకు ఇళ్లు కట్టించేందుకు తాను కృత నిశ్చయంతో ఉన్నానని, భూమా ఆఖరి కోరికను తాను నెరవేర్చి తీరుతానని అసెంబ్లీలో చంద్రబాబు హామీ ఇచ్చారు.