TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యేలకు చంద్రబాబు ర్యాంకులు.. చంద్రబాబుకు ఏ స్థానమంటే..?

Published on: Wed Apr 27, 2016 2:38PM

 

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనతీరును బట్టి వారికి ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకులపైన పెద్ద రచ్చ కూడా జరిగిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలు పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకూ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్ ల పనితీరుపై జరిపిన సర్వేలో తంబెళ్ల ఎమ్మెల్యే శంకర్ మొదటి స్థానంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో నిలిచారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు జిల్లా పరంగా ఐదవ స్థానంలో నిలవగా.. రాష్ట్ర స్థాయిలో 79వ స్థానంలో నిలిచారు.

 

కాగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల నిబద్ధత, నిజాయితీ, ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నియోజకవర్గ పార్టీ శ్రేణులను, జన్మభూమి కమిటీలను సమన్వయ పరచి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ప్రధాన అంశాలుగా టీడీపీ ప్రతి నాలుగు నెలలకోసారి సర్వే నిర్వహిస్తోంది.