TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ భేటీ

Published on: Tue May 20, 2025 9:43PM

 

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని లోకేశ్‌ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.  రానున్న రోజుల్లో ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

విద్యార్థుల ఆసక్తి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఏర్పాటు చేసిన బ్లాక్స్ ఆకట్టుకున్నాయిని మంత్రి తెలిపారు . జీవితం పట్ల వారికున్న క్లారిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వారు కంటున్న కలలు అన్ని సాకారం కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై నమ్మకం పెరిగేందుకు విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయిని లోకేశ్ పేర్కొన్నారు