ఏపీలో అతిథి అధ్యాపకుల జీతాలు పెంపు
Published on: Mon May 12, 2025 3:48PM

ఏపీలో జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న 150 రూపాయల శాలరీని 375 లకు పెంచుతున్నట్టు వెల్లడించింది. అలాగే నెలకు అత్యధికంగా 27 వేల రూపాయల జీతం నిర్ణయించింది. నెలకు అత్యధికంగా రూ.27,000గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


