సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్
Published on: Tue Nov 26, 2024 6:36PM
సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్ అరెస్టు అయ్యారు. మాజీ ఎంపీ రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్‌పాల్ అరెస్టు అయ్యారు.
ఉదయం 11 గంటల నుంచి విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించారు. ఉదయం నుంచి జరిగిన విచారణలో తెలియదు, మర్చిపోయా వంటి సమాధానాలు రావడంతో పోలీసుు బెజారెత్తిపోయారు. ఒక సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును టార్చర్ కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విజయపాల్ అరెస్ట్ కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. గత ప్రభుత్వం విజయపాల్ ను ప్రోత్సహించడం వల్లే టార్చర్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.


