కండీషన్లతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..

 

ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఏపీ రాష్ట్ర హెల్త్ బులెటిన్ ను చంద్రబాబు ఈరోజు విడుదల చేశారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ బులెటిన్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి నెలా 4వ తేదీన హెల్త్ బులెటిన్ ను ప్రభుత్వం విడుదల చేస్తుందని, శిశు మరణాల సంఖ్య తగ్గింపే లక్ష్యంగా వారి ఆరోగ్య పరిరక్షణకు గాను ‘పలకరింపు’ పథకం అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన ఉండాలని, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని, వ్యాధుల గుర్తింపు, వాటి పరిష్కారం చూడాలని, ప్రతి ఆరోగ్య సమస్య పరిష్కారానికి రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు. పెళ్లి చేసుకోకపోతే మంచి జీవితం గడపొచ్చనే ఆలోచన కరెక్టు కాదని, పిల్లలు వద్దనే కండిషన్ తో కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అన్నారు.