రెండు ప్రాంతాల మధ్య చిచ్చు: చంద్రబాబు

 

 

 

రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ యత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించాలని, రెండు ప్రాంతాల జేఏసీ నేతలతో కేంద్రం చర్చలు జరిపి ఎవరికీ నష్టం జరగకుండా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

హస్తిన పర్యటనలో ఉన్న తాను ఎవరితోనూ, ఎక్కడా రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను మాత్రమే శరద్‌యాదవ్‌కు వివరించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రంలోని అనిశ్చితి తొలగించాలని శరద్‌యాదవ్‌ను కోరామని చెప్పారు.



వైసీపీ, కాంగ్రెస్ నేతల సతీమణులు ఉమ్మడిగా రాష్ట్రపతిని కలవడంతో కాంగ్రెస్‌తో వైసీపీ కుమ్మక్కు అయిందని రుజవు అయిందని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చంద్రబాబు అన్నారు.