కాంగ్రెస్ కు చల్లా రాజీనామా

 

Challa Ramakrishna Reddy quits Congress, Challa quits Congress

 

 

మాజీ ఎమ్మెల్యే చల్లారామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ తెలుగువారిని చీల్చే ఆలోచన చేసిందని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డిలాంటి నాయకుడు ఉంటే ఇలాంటి ఉద్యమాలే వచ్చేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజశేఖర రెడ్డి కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, కుటుంబీకులు తప్ప మిగతావారెవరూ చిత్తశుద్ధితో సమైక్యాంధ్రకోసం పోరాడటం లేదన్నారు. జగన్ అనుమతిస్తే ఆ పార్టీలో చేరతానన్నారు.