మరో వైసీపీ కీలక నేత టీడీపీలోకి...!


ఇప్పటివరకూ ఎంతో మంది వైసీపీ నేతలు అధికార టీడీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో కీలక నేత వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలోకి రానున్నట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు వైసీపీ కీలక నేత చలమశెట్టి సునీల్. ఈయన కూడా టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. ఆయన అనుచరులు, కార్యకర్తలు పార్టీ మారిపోదామని సునీల్ పై ఒత్తిడి తెస్తుండటంతో... అందులోనూ జగన్ వైఖరి కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా చలమశెట్టి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రెండు సార్లు గట్టిపోటీనే ఇచ్చాడు. అయితే నిత్యం జనాల్లో ఉంటూ కీలక నేతగా మారాడు. ఇక ఈయన కూడా టీడీపీలోకి జంప్ అయితే అక్కడ టీడీపీ ఉన్న పోటీ సమస్య తగ్గినట్టే..