సంగీత దర్శకుడు చక్రి తండ్రి మృతి

Publish Date:Nov 2, 2012

Chakri father dead, chakri father died, music director chakri father dead, music director chakri father died, jilla venkata narayana dead, jilla venkata narayana died

 

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి తండ్రి వెంకట నారాయణ (73) గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన వెంకట నారాయణ రంగస్థల నటుడుగా సుపరిచితులు. పలు చిత్రాల్లో నటించిన ఆయన, చక్రి సంగీత దర్శకత్వంలో పాటలు కూడా పాడారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్న చక్రి తండ్రి మరణవార్తతో హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది. చక్రి తండ్రి ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాల్లో కూడా క్రియాశీలంగా పాల్గొన్నాడు. ఆయన మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.